Tuesday, 22 September 2026 11:58:36 AM

కొత్త ఏడాదిలోనూ కొన‌సాగుతోన్న కొలువుల కోత...

బాంబు పేల్చిన సెర్చింజ‌న్ దిగ్గ‌జం సీఈవో సుంద‌ర్ పిచాయ్

Date : 18 January 2024 04:26 PM Views : 317

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : గ‌త ఏడాది టెక్ దిగ్గ‌జాలు ఎడాపెడా లేఆఫ్స్‌ కు తెగ‌బ‌డ‌గా, కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొన‌సాగుతోంది. గూగుల్ ఇప్ప‌టికే లేఆఫ్స్ ప్ర‌క‌టించ‌గా ఈ ఏడాదిలోనూ కొలువుల కోత ఉంటుంద‌ని ఏకంగా సెర్చింజ‌న్ దిగ్గ‌జం సీఈవో సుంద‌ర్ పిచాయ్ బాంబు పేల్చారు. ఉద్యోగుల‌కు పంపిన ఇంట‌ర్న‌ల్ మెమోలో జాబ్ ఈ ఏడాది జాబ్ క‌ట్స్ ఉంటాయ‌నే సంకేతాలు పంపారు.మ‌రోవైపు కంపెనీలు ప‌నిభారాల‌ను త‌గ్గించుకునేందుకు ఏఐ సాఫ్ట్‌వేర్‌, ఆటోమేష‌న్ వైపు మ‌ళ్లుతున్న క్ర‌మంలో కొలువుల కోతపై ఆందోళ‌న నెల‌కొన్న నేప‌ధ్యంలో సుంద‌ర్ పిచాయ్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. గ‌త ఏడాది ఉద్యోగుల కుదింపు త‌ర‌హాలో ఈసారి తొల‌గింపులు ఉండ‌వ‌ని, ప్ర‌తి టీమ్‌లోనూ లేఆఫ్స్ ప్ర‌భావం ఉండ‌ద‌ని ఉద్యోగుల‌కు పంపిన మెమోలో పిచాయ్ స్ప‌ష్టం చేశారు.ఈ ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకున్నామ‌ని, అందుకు అనుగుణంగా ఆయా రంగాల్లో పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని పేర్కొన‌నారు. కాగా వాయిస్ అసిస్టెంట్ యూనిట్స్‌, పిక్సెల్‌, నెస్ట్‌, ఫిట్‌బిట్‌, యాడ్ సేల్స్ టీంకు సంబంధించిన హార్డ్‌వేర్ టీంకు చెందిన ప‌లువురు ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు గ‌త‌వారం గూగుల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అగ్‌మెంటెడ్ రియాలిటీ విభాగంలోనూ ఉద్యోగుల‌పై వేటు వేయ‌నున్న‌ట్టు టెక్ దిగ్గ‌జం వెల్ల‌డించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :