Wednesday, 23 September 2026 12:21:48 PM

దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలి...

ప్రధాని నరేంద్ర మోడీ

Date : 01 February 2025 06:24 AM Views : 316

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లక్ష్మీదేవి మనకు సిద్ధి, బుద్ధిని ప్రసాదిస్తుందన్నారు. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా ఆవరణంలో పిఎం మోడీ మీడియాతో మాట్లాడారు. సమావేశాల్లో చర్చలకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నామని, ఈ సమావేశాల్లో కీలక బిల్లులు తీసుకరావడంతో పాటు అన్ని అంశాలపై చర్చ జరగాలన్నారు. వికసిత్‌ భారత్‌కు ఈ బడ్జెట్‌ ఊతమిస్తుందని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని, ఎన్ డిఎ 3.Oలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, ఈ బడ్జెట్ ప్రజల్లో విశ్వాసం నింపడంతో పాటు యువతకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇన్నోవేషన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. మూడోసారి ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని కొనియాడారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్నారు. భారత శక్తి సామర్థాలు మనకు విశేష గుర్తింపును ఇస్తున్నాయని, పార్లమెంటు చర్చల్లో సభ్యులందరూ భాగస్వాములు కావాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :