Monday, 21 September 2026 09:21:59 AM

ఈ నెల 19న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం....

Date : 14 February 2025 08:50 PM Views : 423

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 19న లేదా 20న ఉంటుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) వర్గాలు సూచించాయి. ఎన్నికల్లో గెలిచిన 48 మంది ఎంఎల్‌ఎలలో 15 మందితో బిజెపి అధిష్ఠానం ఒక జాబితా రూపొందించింది. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు పార్టీ ఎంపిక చేయనున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ, సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ వర్మ వంటి పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎంఎల్‌ఎ, సిక్కు లేదా మహిళను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచించాయి. బిజెపి గెలిచినా ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌కు తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో (17, 18 తేదీల్లో) బిజెపి శాసనసభ పక్షం సభ్యులు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది స్పష్టం కానున్నది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు క్రితం వారం విడుదలైన విషయం విదితమే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :