Friday, 07 August 2026 04:25:55 AM

రేసులో ఉండటం తప్పుకాదు..

హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా...కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Date : 05 December 2023 06:52 PM Views : 301

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూ ఢిల్లీ : హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.తన అభిప్రాయం కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పానని అన్నారు. సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి ఎంపికపై హైకమాండ్‌ అన్ని ఆలోచనలు చేస్తుందని, నలుగురు..ఐదుగురు రేసులో ఉండటం తప్పుకాదని ఉత్తమ్‌ అన్నారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేనని ఉత్తమ్‌ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :