Wednesday, 23 April 2025 01:49:17 AM

ఎస్సీ వెల్పేర్ హాస్టల్లో భోజనం వికటించి 23మంది విద్యార్థులు అస్వస్థత..

Date : 20 March 2025 06:23 AM Views : 268

ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : వర్ని మండలం కోటయ్య క్యాంప్ ఎస్సీ వెల్పేర్ హాస్టల్లో బుధవారం భోజనం వికటించడంతో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినిలు ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటి తర్వాత కొంత మంది విద్యార్థినిలకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో హాస్టల్ వార్డెన్ శిరీషకు తెలిపారు. ఫుడ్ పాయిజన్ అయిన వారిలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థినిలు ఎస్‌ఎన్‌పురం గర్ల్స్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆమె వెంటనే వర్ని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినిలు తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది 23 మంది విద్యార్థినిలకు అడ్మిట్ చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ తెలిపారు. 23మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అందించామని ఆమె పేర్కొన్నారు.ఈవిషయం మీడియా ప్రతినిధులు తెలుసుకొని ఆస్పత్రికి వెళ్ళగా హాస్టల్ సిబ్బంది ఫోటోలు తీయవద్దని అడ్డుకొని విద్యార్థినిలను హాస్టల్ సిబ్బంది ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారు. వార్డెన్‌కు పిల్లల అస్వస్థతపై వివరణ కొరకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మెడికల్ ఆఫీసర్ వివరణ కోరగా 23 మంది విద్యార్థులకు ఆస్పత్రిలో పరీక్షించామని ఫుడ్ పాయిజన్‌తోనే ఇలా అయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. ఎంఈఓ డి. సాయిలను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చూడగా రెండు గంటలు అక్కడనే ఉండి విద్యార్థినిలకు మెరుగైన వైద్య పరీక్షలు చేయించామని ఎంఈఓ తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :