ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు నేను మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డ్ లో పసుపు రైతులతో కలిసి పసుపు కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ... పసుపు బోర్డు వచ్చిన పసుపు రైతులకు ఎటువంటి లాభం లేకుండా పోయిందన్నారు. ఎంపీ అరవింద్ ఎన్నికలకు ముందు ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాయించి ఇచ్చాడని గెలిచాక ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాడని అన్నారు. అలాగే ప్రజాభవన్ లో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాతే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ప్రకటన చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని కొంతమంది సిండికేట్గా ఏర్పడి పసుపు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.ఇక పోరాటం చేసే సమయం ఆసన్నమైనదని ఒకరోజు కలెక్టరేట్ దిబ్బంధం నిర్వహిస్తామని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చి పసుపు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే నిజామాబాద్ కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి వెళ్లిపోయారని కనీసం పసుపు రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News