Saturday, 02 May 2026 12:48:50 AM

నిజామాబాద్ జిల్లా లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి..

Date : 20 February 2025 05:41 PM Views : 327

ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : జిల్లాలోని బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పందుల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఓర్సు గంగారం, బాలమణి, కిషన్ గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :