Saturday, 02 May 2026 12:48:55 AM

మహిళను విచక్షణ రహితంగా చితకబాదిన సీఐ...

సీఐపై ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ.

Date : 15 February 2025 05:37 PM Views : 661

ఆకాంక్ష న్యూస్ - నిజామాబాద్ జిల్లా / : పిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను విచక్షణ రహితంగా ఓ సీఐ కొట్టిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వెళ్ళింది.అయితే ఈ ఉత్సవాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ పర్సును కొట్టేశారని అక్కడే పోలీసు ఔట్ పోస్టులో ఉన్న బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు ఫిర్యాదు చేసింది. పర్సు పోయిందని చెప్తే జాతరలో మహిళను దూషిస్తూ, అనవసరంగా రాద్ధాంతం చేస్తావా అంటూ లాఠీతో విచక్షణా రహితంగా సీఐ చితక బాదడంతో మహిళకు వాతలు వచ్చాయి. దీంతో సీఐ విజయ్ బాబు మీద ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :