Wednesday, 18 March 2026 08:52:23 AM

హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి....

శాతవాహన విశ్వవిద్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం...

Date : 01 April 2025 06:10 PM Views : 334

ఆకాంక్ష న్యూస్ - కరీంనగర్ జిల్లా / : హైదరాబాద్ హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులూ దగ్ధం చేసారు. యూనివర్సిటీ ఇంచార్జి చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకురి మోహన్ లు మాట్లాడుతూ.. ప్రభుత్వం తన వైఖరి వీడనడక పోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ రాజ్యం అంటే విశ్వవిద్యాలయాల భూములు అమ్మడమేనా అని ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని,పదవి బాధ్యతలు తీసుకున్నాక విద్యా విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విద్యార్ధుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే విద్యార్థులపై నాన్ బెయిల్ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారదాసు వసంతరావు, వోడ్నాల రాజు, బీఆర్ఎస్వీ ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, సీనియర్ నాయకులు బోడ ఆంజనేయులు, మామిడిపల్లి సాయి, శనిగరం సతీష్, సయ్యద్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :