Wednesday, 18 March 2026 10:18:29 AM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిరాధర ఆరోపణలు చేస్తే సహించేది లేదు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై కరీంనగర్‌ ఏసీపీకి పిర్యాదు..

Date : 25 March 2025 04:40 PM Views : 345

ఆకాంక్ష న్యూస్ - కరీంనగర్ జిల్లా / : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై కరీంనగర్‌ ఏసీపీకి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌,బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలసి పిర్యాదు చేసారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ..గత కొన్ని రోజులు మతం పేరు మీద రాజకీయం చేశాడని, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దొంగ నోట్లు ముద్రించాడని చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చిల్లర మాటలతో కరీంనగర్‌ ప్రతిష్టను బండి సంజయ్ దిగజారుస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై ఇలాంటి వాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జి చుక్క శ్రీనివాస్ , నగర బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు బొంకూరి మోహన్‌, నియోజక వర్గ యూత్‌ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఆరే రవి గౌడ్‌, వోడ్నాల రాజు, ఆఫ్రొజ్‌, సందీప్‌ వర్మ, కిరణ్‌ గౌడ్‌, అజయ్‌, సోహెల్‌, అన్వేష్‌, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :