Wednesday, 18 March 2026 08:52:22 AM

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రక్షాళనకు నా వంతుగా కృషి చేస్తా...

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం వల్లే నా ఓటమికి కారణం... ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

Date : 06 March 2025 06:19 PM Views : 551

ఆకాంక్ష న్యూస్ - కరీంనగర్ జిల్లా / : కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రక్షాళనకు నా వంతుగా కృషి చేస్తానని, పార్టీ నాయకత్వ లోపం వల్లే ఓటమికి కారణమయ్యానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... పట్టుబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమి బాధ్యతను మరింత పెంచిందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాదిగా పార్టీలో మరింత చురుగ్గా పనిచేస్తానని పార్టీ పటిష్టతకు అధిష్టానం తనకు ఏ బాధ్యత ఇచ్చిన నిర్వర్తిస్తానని వెల్లడించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ నాయకులతో కలిసి కలిసికట్టుగా పనిచేసేలా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటు కానీ ఓట్లు 11 శాతం నా ఓటమికి కారణమయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు అండగా నిలిచిన మంథని ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు పట్టు భద్రులకు ఇచ్చిన హామీల అమ్మలకు రేపటి నుండే కార్యాచరణ తీసుకుంటానని అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :