Tuesday, 23 June 2026 01:16:41 AM

మనకు “కొత్తగా రెక్కలొచ్చెనా’’

జనవరి 8 నుండి జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్.....

Date : 06 January 2024 04:46 PM Views : 868

ఆకాంక్ష న్యూస్ - సినిమా వార్తలు / హైదరాబాద్ : తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన జెమినీ టీవీ ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను మనకు అందిస్తుంది.తాజాగా ఇప్పుడు మనకు “కొత్తగా రెక్కలొచ్చెనా ”.. అనే సరికొత్త సీరియల్ ను జనవరి 8 నుండి ప్రసారం చేయబోతోంది. అందమైన పల్లెటూరి రైతుబిడ్డ కావేరి! తను ప్రేమించిన బావ నమ్మక ద్రోహం వల్ల.. ఒక వైపు తన తల్లి బందీగా మారినా , మరో వైపు తోడబుట్టిన చెల్లెలి భవిష్యత్తు ప్రశగా మరీనా.. ఈ పరిగెత్తే ప్రపంచంలో తనవాళ్ళ కోసం ఓ రైతుగా, ఆత్మస్ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా నిలబడిందో తెలిపే కావేరి కథే.. “కొత్తగా రెక్కలొచ్చెనా ”.. ఈ నెల 8 నుండి ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు సా.6 గం. లకు . పల్లెను వదిలి తనవాళ్ల కోసం పట్నం బయలుదేరిన కావేరి, రైతుగా.. తాను కోల్పోయినవన్నీ తిరిగి ఎలా దక్కించుకుందనే.. కథాంశంతో నిర్మితమైన “కొత్తగా రెక్కలొచ్చెనా ”. సీరియల్లో సినీనటి ఆమనీ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ , సెల్వరాజ్ , నిత్యా, అజయ్ ,కావ్య, తదితర నటీనటులు నటించారు.ఈ నెల 8 వ తేదీ సోమవారం సా 6 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ “కొత్తగా రెక్కలొచ్చెనా ”.. సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :